Ticker

6/recent/ticker-posts

గౌరవ మెజిస్ట్రేట్ శ్రీ చెన్నం మధు బాబు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు


ఏలూరు/టీ నర్సాపురం: జిల్లా న్యాయ సేవాసాధికారిక సంస్థ ఏలూరు చింతలపూడి గౌరవ మెజిస్ట్రేట్ శ్రీ చెన్నం మధు బాబు ఆధ్వర్యంలో జిలుగుమిల్లి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, టీ నర్సాపురం ఎస్ఐ దుర్గా మహేశ్వర రావు టీ నర్సాపురం మండలం మర్రిగూడెం గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపును అధికారులు నిర్వహించినారు.


ఈ కార్యక్రమంలో గౌరవ మెజిస్ట్రేట్ వారు, అధికారులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతమైన అమాయక గిరిజనులు ఈ యొక్క వర్షాకాల సీజన్లో సీజన్ జ్వరాలు డెంగ్యూ మలేరియా విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ఎలా చర్యలు తీసుకోవాలనే విషయాలపై మాట్లాడుతూ ఏదైనా జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కలవాలని, వారి యొక్క సలహా పై మందులను వాడుతూ ఆరోగ్యానికి హాని కలగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని  తెలియచేశారు.


ఈరోజు ఈ మారుమూల ప్రాంతమైనటువంటి మర్రిగూడెం గ్రామంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ప్రభుత్వ వైద్యాధికారులతో వైద్య పరీక్షలు చేసి అవసరమైనటువంటి వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలియచేశారు.


ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మీ మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉన్నదని పరిశుభ్రతను పాటించాలని మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని అధిక ప్రాధాన్యత పరిశుభ్రతకు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులు గిరిజనులకు తెలియచేశారు.