Ticker

6/recent/ticker-posts

చిన్నారికి ఆర్థిక సహాయం అందజేత


టీ నర్సాపురం: మండలంలోని వెలగపాడుకు చెందిన నరదల కీర్తి కావ్యశ్రీ ఇటీవల విద్యుత్ షాక్ కు గురైంది.  ఆస్పత్రి వైద్య ఖర్చులు నిమిత్తం ఇబ్బంది పడుతున్న విషయాన్ని కామవరపుకోట సోషల్ వర్కర్స్ టీం దృష్టికి తీసుకెళ్లగా దాతలు నుంచి సేకరించిన 12300 రూపాయల నగదును కీర్తి తండ్రి మురళికి అందజేశారు. ఈ సందర్భంగా మురళి తన కుమార్తె వైద్య ఖర్చుల నిమిత్తం సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు వీరమళ్ళ మధు, పెద్దింటి చంటి తదితరులు పాల్గొన్నారు