అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: అఖండ గోదావరి నది ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ధవలేశ్వరం సర్ ఆర్డర్ కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీరు భారీగా చేరుతోందని రాబోయే మూడు రోజుల్లో సుమారు 5, లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉన్నదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి 1,90,000 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం వరద ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని కోనసీమ జిల్లా గోదావరి తీర ప్రాంత ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం వరద హెచ్చరికలు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో మరియు ధవళేశ్వరం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలమూరు మండలం బడిగువానిలంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంక, కేదారిలంక ,పాలేపులంక, కే గంగవరం మండలం శేరిలంక కోటిపల్లి, పి గన్నవరం మండలం జీ పెదపూడి ఎనిమిది బోట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు ఈ బోట్లు నిర్వహణ సంబంధించి మత్స్యశాఖ అధికారులు నియమించడం జరిగిందని ఆయన ప్రకటన తెలిపారు.
కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004252532
ధవలేశ్వరం కంట్రోల్ రూమ్ నెంబర్ 0883 2417066