బాధితులు తెలిపిన వివరాలు.. బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేష్ - సురేష్ అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్య రమేశ్ 14 ఏళ్ల క్రితం జీవనాధారం కోసం చెన్నై వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఈ మధ్యకాలంలో అతని తల్లి చనిపోయింది. ఈ దుర్ఘటనకు నాలుగు రోజుల క్రితం తల్లి పెద్దకర్మ జరిగింది. ఈ కార్యక్రమం కోసం తల్లి చనిపోయిన తర్వాత 14 ఏళ్లకు రమేష్ ఇంటికి వచ్చాడు. తాను వచ్చిన పని పూర్తి కావ్వడంతో తిరిగి చెన్నై ప్రయాణమయ్యాడు.
శుక్రవారం సాయంత్రం సుమారు ఆరు గంటలకి తమ్ముడు సురేష్ రైల్వేస్టేషన్ లో అన్నయ్య రమేష్ ను విడిచి పెట్టాడు. ఆ తర్వాత తమ్ముడిని ఇంటికి వెళ్లిపోమని చెప్పిన అన్న... తాను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడు. సురేష్... అన్నయ్యకు "హ్యాపీ జర్నీ" అని చెప్పిన తాను ఇంటికి వెళ్లిపోయాడు. తల్లి మరణం మిగిల్చిన బాదతోనే రమేష్ రైల్ ఎక్కాడు.
సురేష్ ఇంటికి వచ్చిన కాసేపటికే రాత్రి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైందని టీవీ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ లు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన తమ్ముడు సురేష్... అన్న రమేష్ కు ఫోన్ చేయగా ఫోన్ తీయలేదు. దానితో మరింత ఆందోళనతో కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. ఈసారి ఫోన్ రిసీవ్ అయ్యింది కానీ... అవతలి వారి గొంతు అన్నయ్య రమేష్ ది కాదు... ఎవరో వ్యక్తిది. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ... రమేశ్ మృతి చెందాడు అని చెప్పాడు.
సురేష్ హుటాహుటున ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి సోదరుడి కోసం తీవ్రంగా గాలించాడు. అయితే అప్పటికే అక్కడ ఉన్న అధికారులు మృతదేహాలను ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పడంతో.. అక్కడ నుంచి ఆసుపత్రులు అని కలియతిరిగాడు. ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు. చివరికి ఓ ఆస్పత్రిలో ఉన్నాడని చిన్న ఆచూకీ లభించడంతో బాలేశ్వర్ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి వెల్లాడు. అక్కడ అన్నయ్య మృతదేహం చూసి బోరున విలపించాడు. తన తల్లి చివరిచూపుల కోసం 14 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన రమేశ్ అన్నయ్య కూడా మరణించాడు. తన తల్లితో పాటు అనంతలోకాలకు వెళ్లిపోయాడు!
ప్రమాదానికి ముందు కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎంత ఇరుకుగా జనం ఎక్కారో ఈ క్రింది విడియో చూడండి.
01) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో గెలిచేది ఏవరు?
మీ అభిప్రాయాన్ని పై క్లిక్ చేసి ఆప్షన్స్ ఎంచుకోండి.. సీక్రెట్ ఓటింగ్ చేయండి.