Ticker

6/recent/ticker-posts

భార్యను రైలెక్కించి.. చివరి నిమిషంలో పనిపడటంతో ఆగిపోయాడు! కానీ భార్య...


కరోణా కోవిడ్19 కాలంలో ప్రతి ఇంటా ఒక్కొక్క విషాధగాధ మిగిలిందంటే.. అది మరపుక ముందే ఒడిశా రైల్వే ప్రమాదం దేశంలోని ప్రజలను ఒకసారిగా దిగ్బ్రాంతి గురిచేసింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఒక్కొక్క విషాద గాథలు వెలుగులోకి వస్తున్నాయి. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్న బాలేశ్వర్‌ గ్రామానికి చెందిన గౌతమ్‌ దాస్‌ మరో కన్నీటి కథ. అతని భార్య విష్ణుప్రియదాస్‌(22)‌కు కొన్ని రోజుల క్రితం కటక్‌లోని ఓ హాస్పిటల్ లో శస్త్రచికిత్స చేయించాడు. దానికి సంబంధించిన చికిత్స కోసం ఆమెను కటక్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు జూన్ 2న సాయంత్రం బాలేశ్వర్ రైల్వే స్టేషన్‌కు భార్య,  అత్తతో వచ్చాడు. తన భార్యను, అత్త ఝరుణాదాస్‌, భార్య తమ్ముడు హిమాన్ష్‌ దాస్‌ను కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కించాడు. వారితో పాటు అదే రైలులో గౌతమ్‌ దాస్‌ కూడా వెళ్లాల్సి ఉంది.. చివరి నిమిషంలో అత్యవసర పని పడటంతో బాలేశ్వర్‌ స్టేషన్‌ లోనే అతను ఆగిపోయాడు. 


పని చూసుకొని తిరిగి వేరే రైలు ఎక్కి వెళ్ళదామని అనుకున్నాడు. వారిని ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చేసాడు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ నుంచి బయల్దేరిన అరగంట వ్యవధిలోనే ట్రైన్ ప్రమాదానికి గురైందని వార్త వినిపించ్చింది. ఈ వార్త అందిన వెంటనే.. ఆందోళనకు గురైన గౌతమ్‌ దాస్‌ బంధువుల సాయంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఛిన్నాభిన్నమైన బోగీల మధ్య తమవాళ్లు ఉన్నారేమోననే ఆందోళనతో వెతికాడు. 


అతని అనుమానమే నిజమైంది. అతని భార్య విష్ణుప్రియ, అత్త, బావమరిది ముగ్గురూ మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న గౌతం దాస్.. ఆదివారం వారికి అంత్యక్రియలు జరిపించాడు. పెళ్లైన ఏడాదికే భార్యను కోల్పోయిన గౌతమ్‌ దాస్‌ రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. 


ఒడిశా రైలు ప్రమాదంలో వెలుగులోకి వస్తున్న ఇలాంటి కన్నీటి కథలెన్నో.. ఇప్పుడు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 280 మంది మృతి చెందారు. 1080 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు.. తమిళనాడుకు చెందిన ఆరుగురు ప్రయాణికుల జాడ ఇప్పటికీ తెలియరాలేదు. వారు బతికున్నారా? లేదా? అనే విషయంపై నేటికీ స్పష్టత లేదు. బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. 

01) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో గెలిచేది ఏవరు? 

మీ అభిప్రాయాన్ని ఓటు గుర్తు పై క్లిక్ చేసి ఆప్షన్స్ ఎంచుకోండి.. సీక్రెట్ ఓటింగ్ చేయండి.










ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. 365రోజులు 24గంటలు పాటలు వినండి.. వినండి ఓలాసంగా ఆనందంగా..