కావున ప్రతి ఒక్కరూ మొక్కల నాటడం అలవాటుగా చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం వ్యక్తిగతంగా కంటే సమిష్టిగా చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. అలాగే వాతావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వస్తువులను వాడకాన్ని తగ్గించాలని, వాటిని స్థానములో ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. అలాగే ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ వాతావరణ పరిరక్షణ బాధ్యతను తప్పనిసరిగా చేపట్టాలని న్యాయమూర్తులు, న్యాయవాదుల తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి పీ. మంగాకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి కె కె వి బుల్లి కృష్ణ, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్ పర్సన్ శ్రీమతి మేరీ గ్రేస్ కుమారి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభినేని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఈరోజు ఉదయం జిల్లా కారాగారం నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ తెలిసో తెలియక చేసిన తప్పుల నుండి పరివర్తన చెందాలని కరాగారం నుండి సమాజంలోకి వెళ్ళిన తర్వాత మంచి పనులను చేయటం ద్వారా మంచి గుర్తింపు పొందొచ్చని తెలిపారు.
అలాగే కారాగారంలో ఉన్న ముద్దాయిలకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయవాదిని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలర్ వెంకట్ రెడ్డి, శ్రీనివాసరావు, ప్యానల్ లాయర్ కె కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.
ELURU FM (All songs)
app DOWNLOAD link:
https://play.google.com/store/apps/details?id=eluru.fm