Ticker

6/recent/ticker-posts

కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ వాహనాల వినియోగంపై ప్రజలందరూ దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్


ఏలూరు జిల్లా ఏలూరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ వాహనాల వినియోగంపై ప్రజలందరూ దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నెట్ క్యాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గో-ఎలక్ట్రిక్ – గో- గ్రీన్ క్యాంపైన్ ను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్బంగా విద్యుత్ ద్విచక్ర వహనములు మరియు ఆటోలను కలెక్టర్ పరిశీలించి వాటి పనితీరును, ధరను తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో కాలుష్యం నియంత్రించడానికి ప్రత్యమ్నాయ మార్గాలను అనుసరించాలన్నారు. పెట్రోలు, డీజల్ వాహనాలను నుండి వెలువడే వాయువు వలన కాలుష్యం సమస్యలు తెలెత్తుతున్నాయన్నారు. దీనిని నివారించడానికి విద్యుత్ వాహనాల వినియోగంపై దృష్టి సారించాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా నెట్ క్యాప్ కో-ఆర్డినేటర్ డి.వి. ప్రసాద్ మాట్లాడుతూ గో-ఎలక్ట్రిక్ – గో-గ్రీన్ ప్రధాన ఉద్దేశ్యం కాలుష్యం నియంత్రించడానికి మరియు వినియోగించడంలో తక్కువ రవాణా ఖర్చుతో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, నెట్ క్యాప్ ద్వారా 48 నెలలు సులభ వాయిదాలతో 9 శాతం వడ్డీతో వాహనాన్ని పొందవచ్చని తెలిపారు.  వాహనం కాలవలసినవారు సెల్ నెం. 9553486987 డెవలప్ మెంట్ అధికారి అయిన యు. హరీష్ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎవిఎస్ఎన్ మూర్తి, జెడ్పి సిఇఓ రవికుమార్, టివిఎస్ కంపెనీ మేనేజరు ప్రసాద్, హీరో కంపెనీ మేనేజరు రమేష్, ఎథర్ కంపెనీ మేనేజర్ ప్రసాద్, మహీంధ్రా కంపెనీ మేనేజరు దిలీప్,  నెట్ క్యాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

BCN TV app Download link: https://play.google.com/store/apps/details?id=bcn.tv3

BCN TV Live Link: https://sananewstv.blogspot.com/2023/05/bcn-tv-live_6.html

పర్మినెంట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని న్యూస్ చదవండి. అలాగే BCN LIVE TV చానల్ ఉంది చూడండి.

ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.

ELURU FM (All songs)
app DOWNLOAD link:
https://play.google.com/store/apps/details?id=eluru.fm