Ticker

6/recent/ticker-posts

యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతనకమిటీ ఏర్పాటు.. SPARK POWER CONFERENCE కరపత్రం ఆవిష్కరణ..


డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం: యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జి.డి.యం చర్చ్  పాస్టర్ నోబెల్  ఆధ్వర్యంలో  మండల సెక్రెటరీ ఆనందరావు అధ్యక్షతన ఆశీర్వాదకరంగా జరిగింది. అదేవిధంగా నూతనకమిటీ ఏర్పాటు జరిగింది. నూతనకమిటీ సభ్యులకు, పాత కమిటీ సభ్యులకు సన్మానంలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్. కార్ల్ డేవిడ్ కొమానపల్లి వాక్య సందేశం అందించారు. 

ఫెలోషిప్ ని బలోపేతం ఎలా చేయాలో నూతన కమిటీకీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి సెక్రటరీ యెహోషువకు అడ్వైజర్ రాజ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం ఈ నెల జూన్ 27వ తేదీన అమలాపురంలోని ఇందుపల్లి రోడ్డులో ఉన్న 'ఏ' కన్వెన్షన్ హాల్ లో జరగబోవుచున్న. "SPARK POWER CONFERENCE" పాంప్లెట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కార్ల్ డేవిడ్ కోమానపల్లి  ప్రార్ధన చేసి ఆవిష్కరించారు. 

ఈ కరపత్రాలు అందరికీ చేరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, జోన్, మండల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

BCN TV app Download link: https://play.google.com/store/apps/details?id=bcn.tv3

BCN TV Live Link: https://sananewstv.blogspot.com/2023/05/bcn-tv-live_6.html

పర్మినెంట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని న్యూస్ చదవండి. ఈ యాప్ లో BCN LIVE TV చానల్ ఉంది చూడండి.

ఈ కార్యక్రమానికి సంబంధించిన విడియో చూడండి.👇

ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.