పారాసిటమాల్.. ఈ ట్యాబ్లెట్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది. కొవిడ్ కాలములో ఇది ఒక పిప్పరమెంట్ బిల్లలా ప్రజలు వాడేశారు. ఇప్పుడు ఒంట్లో ఏ కాస్త నలతగా ఉన్న దీనిని ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఇది మనిషి జీవితంలో మమేకమైపోయింది. ఈ ట్యాబ్లెట్‌ను పాములను చంపడానికి ఉపయోగిస్తున్నారనే విషయం మీకు తెలుసా!.. నమ్మలేక పోతున్నారు కదా!.. కానీ ఇది నిజమండీ!.. అగ్రరాజ్యం అమెరికాలో పాముల్ని చంపడానికి ఈ ట్యాబ్లెట్లను వాడుతున్నారు. అసలు పారాసిటమాల్ మందుతో పాములను ఎలా చంపుతున్నారు?.. వన్యప్రాణులను సంరక్షించిల్సిన దేశం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ విషయం గురించి తెలుసుకుందాం.
అమెరికాలోని గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ జాతికి చెందిన పాములు ఎక్కువగా ఉన్నాయి. ఈ పాములు సుమారు ఒక్కొకటి నుంచి మూడు మీటర్ల పొడవు ఉంటాయి. ఇవి ఎక్కువగా చెట్లపైనే నివాసం ఉంటాయి. బ్రౌన్ ట్రీ స్నేక్స్‌ను చంపేందుకు చినిపోయిన ఎలుకలను సేకరించి వాటిలోకి 80 మిల్లీగ్రాముల చొప్పున పారాసిటమాల్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని కార్డ్‌బోర్డ్ పారాచూట్‌లకు అతికించి హెలికాప్టర్ల ద్వారా అడవుల్లో చెట్లపై వదిలేస్తున్నారు. సహజంగానే చెట్లపై ఉండే బ్రౌన్ ట్రీ స్నేక్స్.. ఆ పారాచూట్‌లో చనిపోయి ఉన్న ఎలుకలను తిని కొద్దిగంటల్లో చచ్చిపోతున్నాయి. అయితే ఆ పాములు ఎలుకల్ని తిని చనిపోయినవా? లేదా తెలుసుకునేందుకు ఎలుకల్లో రేడియో ట్రాకర్లను అమరుస్తున్నారు. దీనికోసం ఏటా దాదాపు రూ.80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.
ఈ గువామ్ దీవిలో దాదాపు 30 లక్షలకు పైగా బ్రౌన్ ట్రీ స్నేక్స్ ఉండొచ్చని అంచనా. వీటివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న చాలా జాతుల వన్యప్రాణులు మనుగడ దెబ్బతింటున్నాయి. ఈ పాముల వల్ల ఇప్పటికే గువామ్ దీవిలో ఉండే సుమారు 10 జాతుల పక్షులు అంతరించిపోయాయి. తొండలు, గబ్బిలాల మనుగడ కష్టమైపోయింది. అంతేకాకుండా విద్యుత్ తీగల్లో పాములు చిక్కుకోవడం వల్ల తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈ కారణం వలన పరికరాలు దెబ్బతింటున్నాయి. దీంటో వాటి మరమ్మతుకు ఏటా 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టం కలుగుతుంది. అందుకే బ్రౌన్ ట్రీ స్నేక్స్ సంఖ్యను తగ్గించేందుకు వాటిని చంపాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
నిజానికి బ్రౌన్ ట్రీ స్నేక్స్ అమెరికాలోని గువామ్ దీవికి చెందినవి కాదు. దాదాపు 70 ఏండ్ల నుంచి మాత్రమే ఇవి అక్కడ ఉంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ జాతి పాములు అమెరికాకు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆ యుద్ధం సమయంలో గువామ్ దీవి అమెరికా సైనిక స్థావరంగా అక్కడ ఉండేది. కొంతకాలం ఈ స్థావరం జపాన్ ఆధీనంలో కూడా ఉంది. అప్పుడే సరుకు రవాణా ఓడల ద్వారా జపాన్ నుంచి ఈ పాము గువామ్ దీవికి చేరి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈవిధంగా ఇవి వేరే దేశం నుంచి రావడం వల్లే వీటి సంఖ్య ఇంతలా పెరిగిపోయింది. అదేలగా అంటారా? సాధారణంగా ఒక జీవి మనుగడ సాధించాలంటే మరో జీవిపై ఆధారపడుతుంది. మొక్కలను సాధు జంతువులు తిని బతికితే.. ఆ సాధువు జంతువులను క్రూర మృగాలు తింటూ మనుగడ సాగిస్తాయి. ఒకవేళ అలా జరగకపోతే జీవరాశుల సమతుల్యం దెబ్బతింటుంది.
అమెరికాలోని గువామ్ దీవిలో ఇప్పుడు అదే జరిగింది. బ్రౌన్ ట్రీ స్నేక్స్ తమ సహజ ఆవాస ప్రాంతంలో ఉండి ఉంటే.. వాటి శత్రు జంతువులకు ఆహారంగా మారిపోయేవి. దీంతో ఆ పాముల సంఖ్య నియంత్రణలో ఉండేది. కానీ ఈ పాములకు గువామ్ దీవి సహజ నివాస ప్రాంతం కాదు. దీంతో వాటికి అక్కడ శత్రువులు లేకుండా పోయాయి. అందువల్ల అక్కడ బ్రౌన్ ట్రీ స్నేక్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 1950లో తొలిసారిగా బ్రౌన్ ట్రీ స్నేక్ ఇక్కడ కనిపించింది. ఆ తర్వాత 40 ఏండ్లలోనే ఇవి పెద్ద సమస్యగా మారిపోయాయి. అప్పటి నుంచి ఈ పాములను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగానే పారాసిటమాల్ ట్యాబ్లెట్ ముందుతో వాటిని చంపుతున్నారు.
ఎక్కడి నుంచో గువామ్ దీవికి వచ్చిన బ్రౌన్ ట్రీ స్నేక్స్ వల్ల ఆ ప్రాంతం ఎంతగానో ఇబ్బంది పడుతున్నది. ప్రస్తుతానికి అమెరికాలో ఈ ఒక్క దీవిలో మాత్రమే ఈ జాతి పాములు ఎక్కువగా ఉన్నాయి. ఈ పాములు మిగిలిన ప్రాంతాలకు చేరితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని, వీటి సంఖ్యను ఇక్కడికే పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే చాలా పాములను పారాసిటమాల్‌తో చంపుతున్నది. అయితే ఈ పాములను అంతరింపజేయడమే తమ లక్ష్యం కాదని.. వాటి నియంత్రించేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా స్పష్టం చేసింది. కానీ వన్యప్రాణుల సంరక్షకులు మాత్రం ఈ చర్యను వ్యతిరేకిస్తూన్నాయి.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.
BCN OTT