డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, రాజోలు: రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరికృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందారు. వీరు 1999లో కాంగ్రెస్ పార్టీకి రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మళ్ళీ 2004లో అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన భార్య ప్రస్తుతం తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నెంబర్ గా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కృష్ణంరాజు శిష్యుడుగా రాజకీయరంగంప్రవేశం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. గతకొన్ని రోజులుగా ఆయనకు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజోలులో ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు.