డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం: పొగాకు వినియోగానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు ఎన్ సి డి సోషల్ వర్కర్ ప్రమీల బుదవారం ఉదయం పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం పురస్కరించుకొని ఎన్ సి డి సోషల్ వర్కర్ ప్రమీల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామా పంచాయతీ గ్రామా సభలో పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని అన్నారు. అందుకే భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధించిందని. తెలిపారు. పొగాకు ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పిస్తూ పొగాకు వల్ల వ్యాపార సంస్థలకు లాభాలు కలిగిన ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని గుగ్గిపాలు చేస్తుందని వివరించారు, ధూమపానం మానుకుంటే "మీ జీవితం అంతా సుఖంగా గడపగలుగుతారని". అందుకే సిగరెట్, గుట్కా వద్దు.. జీవితమే ముద్దు అని తెలుపుతూ వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి.నాగేశ్వరరావు, వీఆర్వో నాగరాజు, సర్పంచ్ కె.రామాంజనీయ స్వామి, సోషల్ వర్కర్ కె.ఝాన్షీ, ఎన్ టి సి పి సోషల్ వర్కర్ కె.ప్రమిళ తదితరులు పాల్గొన్నారు.