Ticker

6/recent/ticker-posts

మాచవరం గ్రామములోని శ్రీ సుభూషణ్ ట్రేడర్స్ ఎరువులు దుకాణాని తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు.. రూ 2,05,850/-లు విలువగల ఎరువులు సీజ్


అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలోని అంబాజీపేట మండలం: ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె.కుమార్ ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ శాఖ, లీగల్ మెట్రాలజి అధికారులతో కలిసి సంయుక్తముగా డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలోని అంబాజీపేట మండలములోని మాచవరం గ్రామములోని శ్రీ సుభూషణ్ ట్రేడర్స్ ఎరువులు దుకాణాని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసారు.


డి.ఏ.పి, 18:18:09 ఎరువులకు సంభందించి స్టాక్ రిజిస్టర్ కు గ్రౌండ్ స్టాక్ మధ్య వ్యత్యాసం ఉండుట చేత మరియు రైతులకు చెల్లుబాటు అయ్యే బిల్లులు ఇవ్వడంలో డీలర్ విఫలమైనందున మండల వ్యవసాయ అధికారి సదరు షాపు యజమానిపై  6-ఏ క్రింద కేసు నమోదు చేసి సుమారు రూ 2,05,850/-లు విలువ గల 7.550 మెట్రిక్ టన్నుల డి.ఏ.పి, 18:18:09 ఎరువులను సీజ్ చేసారు.


ఈ సందర్భముగా ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె కుమార్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో ఎరువులు, విత్తనములు మరియు పురుగుమందుల దుకాణలలో నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ఎవ్వరైనా ఎరువులు, విత్తనములు మరియు పురుగుమందులను గరిష్ట అమ్మకపు ధర కన్న ఎక్కువ ధరకు అమ్మకము చేసిన, అక్రమ నిల్వలు ఉంచిన, నకిలీ విత్తనములు అమ్మకాలు చేసినా సదరు దుకాణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్లు సత్యకిషోర్, వ్యవసాయ అధికారి భార్గవ మహేష్ మరియు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.