Ticker

6/recent/ticker-posts

ఫాగింగ్ యంత్రాలతో దోమల నివారణ చర్యలు. డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్


ఏలూరు జిల్లా, కుక్కునూరు: వరద ప్రభావిత గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వాహణతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టామని జిల్లా పంచాయతీ అదికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు కుక్కునూరు, వేలేరిపాడు  వరద ప్రభావిత గ్రామాలలో  25 ఫాగింగ్ యంత్రాలను సిద్దం చేసామని దోమలు నివారణ చర్యలో భాగంగా  ఈ యంత్రాలను వినియోగంలోగి తేనున్నామని డిపిఓ అన్నారు. స్థానికంగా ఉండే సిబ్బందే కాకుండా అదనంగా  200 మంది సిబ్బంది అదనంగా పారిశుద్ధ్య నిర్వాహణ పనులను పర్యవేక్షిస్తున్నారని అలాగే వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న 42 ఓ.హెచ్.ఆర్ ట్యాంకులను శుభ్రపర్చి ప్రజలకు స్వచ్చ త్రాగునీరు అందించడానికి జిల్లా పంచాయతీ వింగ్ ద్వారా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అదనంగా శానిటేషన్ మెటీరియల్ అన్ని ప్రాంతాలలో తరలించడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల త్యాగం మరవలేనిదని వారి సమర్ధవంతమైన సేవలు, వైద్యశాఖ సహకారంతో వరద ప్రాభావిత ప్రాంతాలలో ప్రజలు అనారోగ్యం గురికాకుండా ఉన్నారన్నారు. పారిశుద్ధ్య నిర్వాహణ నిరంతర చర్యని  ప్రజలు, నాయకులు సహకరించడం వలన  మూడు విడతలలో పారిశుద్ధ్య పనులు చేపట్టామని, వరద తగ్గుముఖం పడితే అన్ని ప్రాంతాలలో పూర్తిస్థాయి పారిశుద్ధ్య నిర్వాహణ పనులు చేపడతామని డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు.