Ticker

6/recent/ticker-posts

ద్వారకాతిరుమలేశ్వరుని దర్శించుకున్న మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు


ఏలూరు/ద్వారకాతిరుమల: ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంగళవారం సి. రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. శ్రీవారి బంగారు వాకిలి గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తరువాత పద్మావతి అండాళ్ అమ్మవారు లను దర్శించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఆయనకు ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాన్ని కప్పి,వేద ఆశీర్వచనం పలికారు. 


ఈ సందర్భంగా ఆలయ ఏఈవో మెట్టపల్లి దుర్గారావు, మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు శ్రీవారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. చైర్మన్ వెంట ఓ ఎస్డి ఎస్.శ్రీనివాస్ జీవన్ వున్నారు.తొలుత ద్వారక తిరుమలకు చేరుకున్న సి. రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు స్థానిక తహశీల్దార్ సతీష్, డిపిఆర్వో రామచంద్రరావు పూలబోకే అందజేసి స్వాగతం పలికారు.