Ticker

6/recent/ticker-posts

ఆప్కోచేనేత షోరూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్


ఏలూరు: భారతీయ చేనేత మన అమూల్య సాంస్కృతిక వారసత్వమని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు.  ఏలూరు సర్. సిఆర్ రెడ్డి కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో చేనేత వస్త్రాలయాన్ని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. 


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే చేనేత వస్త్రాల వినియోగం మరింత పెంపొందించవలసిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించి నేత కార్మికులను ఆదరించాలని చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా లక్షలాదిమంది కార్మికులకు జీవనోపాధి చూపించవచ్చన్నారు. మారుతున్న అభిరుచులకు, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ కళను, నైపుణ్యాన్ని చేనేత కళాకారులు మార్చుకుంటూ వస్తున్నారన్నారు. అటువంటి చేనేత కళాకారులను మరింత ప్రోత్సహించేందుకు చేనేత వస్త్రాలను ధరించి ప్రోత్సహించాలని ప్రజలకు ఆయన సూచించారు.   


ఈ కార్యక్రమంలో ఆప్కో అడిషనల్ జనరల్ మేనేజరు కొపర్తి అప్పారావు, డెవలప్ మెంట్ ఆఫీసర్లు బి. హనుమంతరావు, బి. రామయ్య, ఏడిఓ జి. గుర్రాజు, ఆప్కో మాజీ డెరెక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.