పెదపాడు: తూఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. పెదపాడు మండలం సత్యవోలు గ్రామం లో శనివారం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ఇటీవలి తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు నీట మునిగి పంట పాడైన రైతులకు మరల అపరాల పంట వేసుకొనుటకు సబ్సిడీ లో పెసర విత్తనాలు ఎకరానికి 8 కేజీ లు చొప్పున అందించారు. పెదపాడు మండలానికి 275 క్వింటోళ్ళ అపరాల విత్తనాలు సబ్సిడీ లో అందించనున్నారని తెలియచేసినారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఇందులో భాగంగా గానే అపరాలు పంట వేసుకొనుటకు పెసలు, మినుములు విత్తనాలు ముందుగా అందజేయడం జరుగుతుందనీ తెలిపారు. వరి పంట పొలాలను కూడా అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని నమోదు చేయడం జరుగుతుందనీ త్వరలోనే ప్రభుత్వం నుండి రైతులకు నష్ట పరిహారం అందజేయడం జరుగుతుందనీ తెలిపారు.ఈ కార్యక్రమములో లో సత్యవోలు సర్పంచ్ రంభా ఉమామహేశ్వరి, ఉపసర్పంచ్ పెంకి శ్రీనివాస రావు , మండల వ్యవసాయ శాఖాధికారి ప్రదీప్ కుమార్, రైతులు పాల్గొన్నారు.