Ticker

6/recent/ticker-posts

యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ యుపిఎఫ్ మండల స్థాయి నూతన కమిటీ ఎంపిక


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం: మండల యూపీఎఫ్ నూతన కమిటీ ఎంపిక స్థానిక రంగాపురం ముసలి గాబ్రియల్ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. యుపిఎఫ్ సమావేశమునకు ముఖ్యఅతిథిగా జిల్లా యుపిఎఫ్ అధ్యక్షులు కార్ల డేవిడ్ కొమానపల్లి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా యుపిఎఫ్ జోనల్ అధ్యక్షులు గొల్లకోటి సత్య ప్రసాద్ మరియు జిల్లా సెక్రెటరీ యెహోషువ హాజరయ్యారు. 


ఈ సమావేశంలో జిల్లా యుపిఎఫ్ అధ్యక్షులు కార్ల డేవిడ్ కొమానపల్లి ఆలోచన విధానాలతో అమలాపురం మండలం కొత్త యుపిఎఫ్ కమిటీని ఎంపిక చేశారు. ఈ నూతన కమిటీలో అమలాపురం మండల అధ్యక్షులుగా మొసలి స్పర్జన్, ఉపాధ్యక్షులుగా ఎస్ నోబెల్ రాయ్, సెక్రటరీగా ఎస్ ఆనందరావు, జాయింట్ సెక్రటరీగా  కృపావరం, ట్రెజరర్ గా ఎస్ జోసెఫ్, జాయింట్ ట్రెజరర్ గా ఎస్ జాన్ వెస్లీ, ఎంపికయ్యారు. కొత్తగా ఏర్పడిన నూతన కమిటీ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు...