Ticker

6/recent/ticker-posts

లింగపాలెంలో ఘణంగా స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు


 ఏలూరు జిల్లా లింగపాలెం: మండలంలోని లింగపాలెంలో స్వర్గీయ  నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగపాలెం ప్రధాన సెంటర్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మోరంపూడి మల్లికార్జునరావు, గంటా శ్రీనివాసరావు, పామర్తి వెంకటేశ్వరరావు, అసలేటి అజయ్, కంభం రవి, పోలుబోయిన రామకృష్ణ,పొదిల.బాలశౌరి, సందిపాము ఏసుపాదం తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.