డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు వెళ్లి తిరిగి వస్తూన్న సమయంలో లారీ ఢీ కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడు మృతి చెందారు. అమలాపురం మండలం రంగాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కరేళ్ళ రామాంజనేయులు మహానాడు నుండి తిరుగు వస్తున్న సమయంలో కొత్తపేట సమీపంలో లారీఢీ కొట్టడంతో అక్కడక్కడే మృతి చెందారు. రామాంజనేయులుకు ఇద్దరు పిల్లలు. రామాంజనేయులు మృతితో అమలాపురం నియోజకవర్గం ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, టీడీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.