ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యూపీఎఫ్ అధ్యక్షులు rev కార్ల్ డేవిడ్ కొమనాపల్లి మాట్లాడుతూ ఈ ఫెలోషిప్ ఎందుచేత ఏర్పడిందనే గురించి వివరించారు. మనమందరం ఐక్యత కలిగి, ఆదర్శంగా ఉండాలని, ఆదరణ పథకం చాలా దీవెనకారంగా ఉన్నదని ఫెలోషిప్ విషయంలో మీరందరూ ప్రయాస పడాలని తెలిపారు. అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ విక్టర్ నందా ప్రసంగించారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ యు భాస్కర రావు, జిల్లా ట్రెజరర్ ప్రకాశరావు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అడ్వైజర్ వై సామ్యూల్ రాజు, ఆత్రేయపురం మండల ప్రెసిడెంట్ ఏసుదాస్, కమిటీ కొత్తపేట మండల ప్రెసిడెంట్ విల్సన్, కమిటీ జోన్ నాయకులు అమలాపురం మీడియా ప్రతినిధి రెవరెండ్ నరేష్, పాల్గొని చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ముగిసిందని రెవరెండ్ నరేష్ తెలిపారు.