Ticker

6/recent/ticker-posts

కర్రెల రామాంజనేయులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప


అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం: మహానాడుకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్ ప్రమాదంలో మరణించిన కర్రెల రామాంజనేయులు కుటుంబ సభ్యులను రాష్ట్ర టిడిపి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహానికి తెలుగు దేశం పార్టీ జెండాను కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరపు నుండి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, పార్టీ సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ రెండు లక్షలు నగదును ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందని చిన్న రాజప్ప తెలిపారు. అలాగే రామాంజనేయులు పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదువుకునేందుకు ఏర్పాట్లు పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు రాజప్ప తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు అయితబత్తుల ఆనందరావు, జిల్లా జగదీశ్వరి సమనస గ్రామ సర్పంచ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.