ఏలూరు జిల్లా ఏలూరు: ఎన్నో ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టులు గళమెత్తి నినాదాలు చేశారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వేంకటేష్ కు వినతి పత్రం అందించారు. ముందుగా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ డిపిఆర్ఓ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ద్విచక్ర వాహనాల పై ర్యాలీగా వెళ్ళారు. ఈ నినాదాలతో ఏలూరు పట్టణంలో పెద్దపెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్పందన కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ కు అందచేశారు.
ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు శంకర్ రావు మాట్లాడుతూ.. అక్రిడేషన్ కార్డు ఉన్న వారు లేనివారు అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులకు ప్రభుత్వమే గృహ నిర్మాణాలు చేయాలని. జర్నలిస్ట్ కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించాలని, జర్నలిస్టు సంఘాలకు కమిషన్ ఏర్పాటు చేయాలని, భీమా సదుపాయం కల్పించాలని, వినతిపత్రంలో వ్రాసినట్లు రాష్ట్ర నాయకులు శంకర్ రావు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కాక జర్నలిస్టులు సతమతమవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు జర్నలిస్టులకు అవి కల్పిస్తాం, ఇవి కల్పిస్తామని హామీ ఇవ్వడం తప్పా.. నెరవేర్చిన ప్రభుత్వాలు లేవని బాధను వ్యక్తం చేశారు. పత్రికా యాజమాన్య నిబంధనలు విలేకరులుపై రుద్ది అక్రిడేషన్ ఎగనామం చేయడం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న విలేకరుల మన్నోభావాలు తెబ్బతింటున్నాయని అన్నారు. ఏ విధమైన వేతనాలు లేకుండా గౌరవప్రదమైన వృత్తిగా భావించి, సామాజిక స్పృహతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసేలా.. ప్రజల పక్షాన నిలిచి ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.
తరతరాల నుంచి వస్తున్న పాత్రికేయు వ్యవస్త ఇకముందు కనుమరుగు అయిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు.. ఇప్పటికే అక్రిడేషన్ తగ్గించడం వలన విలేకరులుగా ముందుకు రావడానికి వెనకడాతున్నారని అన్నారు. వినతి పత్రాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వేంకటేష్ సానుకూలంగా స్పందించి వెంటనే సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గంగాభవానిని పిలిచి జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం గురించి ఆదేశాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం అందరికీ ప్రభుత్వ గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. శంకర్ రావు నేతృత్వంలో జిల్లా అడాహక్ కమిటీ సభ్యులు కె.గంగరాజు. ఎస్టీ జాబిర్, కె.సోమ శేఖర్, బీసీఎన్ ఎడిటర్ షకీర్ బాబ్జి, ప్రజాశక్తి డెస్క్ ఇంచార్జి ప్రసాద్, దెందులూరు కమిటీ అధ్యక్షుడు ఎస్. ఋషీరావు, కార్యదర్శి పి వెంకట్రావు, కోశాధికారి సత్యనారాయణ, ఏలూరు కమిటీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కోశాధికారి సి హెచ్ ప్రతాప్, జాయింట్ సెక్రటరీ ఎమ్. సజ్జి ఎర్లీ పోస్ట్ ఎడిటర్ మిల్టన్, ఏపీ బి. జె. ఏ అధ్య క్షుడు టి ఎన్ స్వామి వివిధ పత్రికలు, ఛానళ్ల విలేకరులు శ్యామ్, పెద్దిరాజు, జయరామ్, విగ్నేష్, సోమేశ్వర రావు, ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.