Ticker

6/recent/ticker-posts

ఎం ఎస్ పి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాలి: విసంపల్లి సిద్దు మాదిగ

 
బుట్టాయిగూడెం: పశ్చిమ ఏజెన్సీలో ఎం ఎస్ పి ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీల నిర్మాణ ఉధృతం,,, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత చిడిపి కుటుంబరావు మాదిగ అధ్యక్షతన ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ గ్రామ సభ జరిగింది ఈ సభకు మహాజన సోషలిస్టు పార్టీ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి విసంపల్లి సిద్దు మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దు మాదిగ మాట్లాడుతూ మహాజన మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు విలేజ్ మిషన్ ఫిఫ్టీ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏజెన్సీలో నివసిస్తున్న దళితులకు ఆర్టికల్ 21 ప్రకారం వారి జీవించే హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. అచ్చిపాలెం గ్రామంలో సుమారు 500 ఓట్ బ్యాంకు కలిగిన మాదిగలు ఇంటి స్థలం లేకుండా తరతరాలుగా జీవిస్తున్నారని, తక్షణమే వారికి నివాస స్థలం పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తనగల శేఖర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్షసాధన తోపాటు వృద్ధుల వితంతువులకు పెన్షన్ ఆరోగ్యశ్రీ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ ఈ సమాజంలో దళితులు ఆత్మ గౌరవం లాంటి ఎన్నో సమస్యలు సాధించిన గొప్ప వ్యక్తి మంద కృష్ణ మాదిగని కొనియాడారు. పోలవరం నియోజకవర్గ ఎంఆర్పిఎస్ కన్వీనర్ లంకా జై బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బుట్టాయిగూడెం ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జిగా బొడ్డపాటు రమేష్ మాదిగను సిద్దు మాదిగ నియమించారు. ఎస్సీ వర్గీకరణ చేయని పార్టీలను రేపు రాబోయే రోజుల్లో తరిమికొట్టాలని మందా కృష్ణ మాదిగ నిర్మించిన ఎం ఎస్ పి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.